తిరుమల : శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సే తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భార్య షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న శ్రీలంక ప్రధానికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారా వద్ద సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన మంత్రి మహింద రాజపక్సేకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
Home News