గెలిచిన భారత్.. దక్కిన సిరీస్

గెలిచిన భారత్.. దక్కిన సిరీస్వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 237 పరుగులు చేసింది.

238 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ను కట్టుదిట్టమైన బౌలింగ్ తో 46 ఓవర్లలోనే 193 పరుగులకు వెస్టిండీస్ ను ఆలౌట్ చేసింది భారత్. టీమిండియా గెలుపులో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కీలక పాత్ర వహించాడు. ఫలితంగా రెండో వన్డే గెలిచిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఫిబ్రవరి 11న మూడో వన్డే నామమాత్రంగా జరుగనుంది.