అక్కడ మొదలైన టోల్ బాదుడు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద పెంచిన చార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి, కొర్లపాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద వసూలు చేయనున్న కొత్త చార్జీల వివరాలను జీఎమ్మార్ సంస్థ విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే కారు, జీపులు మూడు టోల్ గేట్ల వద్ద కలిపి రూ. 310 చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొర్లపాడ్, పంతంగి టోల్ గేట్ల వద్ద చార్జీల వివరాలు.పంతంగి టోల్ గేట్ వద్ద ..
కారు, జీపు – సింగిల్ జర్నీ రూ. 90 , డబుల్ జర్నీ రూ. 135, మంత్లీపాస్ రూ. 2,965
లైట్ కమర్షియల్ – సింగిల్ జర్నీ రూ.140, డబుల్ జర్నీ రూ.210, మంత్లీపాస్ రూ. 4,685
బస్సు, ట్రక్కు – సింగిల్ జర్నీ రూ. 290, డబుల్ జర్నీ రూ. 435, మంత్లీపాస్ రూ. 9,685
హెవీకన్ స్ట్రక్షన్ – సింగిల్ జర్నీ రూ. 450, డబుల్ జర్నీ రూ. 675, మంత్లీపాస్ రూ. 14, 970
ఓవరైజ్డ్ – సింగిల్ జర్నీ రూ. 560, డబుల్ జర్నీ రూ. 845, మంత్లీపాస్ రూ. 18,740
కొర్లపాడు టోల్ గేట్ వద్ద ..
కారు, జీపు – సింగిల్ జర్నీ రూ. 120, డబుల్ జర్నీ రూ. 180, మంత్లీపాస్ రూ. 4,025
లైట్ కమర్షియల్ – సింగిల్ జర్నీ రూ.190, డబుల్ జర్నీ రూ.285, మంత్లీపాస్ రూ. 6,385
బస్సు, ట్రక్కు – సింగిల్ జర్నీ రూ. 395, డబుల్ జర్నీ రూ. 595, మంత్లీపాస్ రూ. 13,240
హెవీకన్ స్ట్రక్షన్ – సింగిల్ జర్నీ రూ. 615, డబుల్ జర్నీ రూ. 925, మంత్లీపాస్ రూ. 20,530
ఓవరైజ్డ్ – సింగిల్ జర్నీ రూ. 765, డబుల్ జర్నీ రూ. 1,150, మంత్లీపాస్ రూ. 25,545