టెన్షన్ టెన్షన్ గా మారిన యాదాద్రి
వరంగల్ టైమ్స్, యాదాద్రి : యాదాద్రి కొండపైకి ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక యువకులు ధర్నాకు దిగారు. యువకుల ధర్నాను నిలువరించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు యువకులకు మధ్య తోపులాట జరిగింది. ఆలయ ఈఓ తీసుకుంటున్న తన సొంత నిర్ణయాలు స్థానికులకు ఇబ్బంది కలిగే విధంగా ఉందని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆటోలకు, ద్విచక్ర వాహనాలకు నిత్యం అనుమతి ఇవ్వాలంటూ యువకులు వినతి పత్రం అందచేశారు. ఇలాంటి నిర్ణయాలను ఈఓ వెనక్కి తీసుకోకపోతే తమ కార్యాచరణ తీవ్రరూపం దాల్చుతుందని స్థానిక యువకులు, వాహనదారులు హెచ్చరించారు.