లోయలో పడిన టాటా సుమో..9 మంది మృతి 

లోయలో పడిన టాటా సుమో..9 మంది మృతి

వరంగల్ టైమ్స్, శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో లోయలోకి పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సురాన్ కోట్ కు చెందిన 13 మంది మోరాహ్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం తిరిగి సురాన్ కోట్ కు టాటా సుమోలో బయల్దేరారు. అయితే బఫ్లియాజ్ వద్ద అదుపుతప్పిన సుమో లోయలోకి దూసుకెళ్లింది.

దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారని, మరో నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో నలుగురు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. సుమో 300 అడుగుల లోతులో పడిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.