మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి

మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి

మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి

warangaltimes, క్రైం డెస్క్ : మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. విజయవాడ నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరణం పద్మా నాయుడు కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వారి స్వస్థలం విజయవాడ. ఇటీవల వారి బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు పద్మా నాయుడు కుమార్తె ప్రీతి వచ్చారు. శనివారం ఆమె తన బంధువులతో కలిసి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు.

అయితే చీకటిగూడెం శివారు వద్ద వారి కారును సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ప్రీతి కారు రోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ప్రీతి తలకు తీవ్రగాయాలు కావడంతో అమె అక్కడిక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న దొప్పలపూడి శ్రేయాస్, కారులో ప్రయాణిస్తున్న చేకూరి సరిత, దివి విశ్వవిఖ్యాత్, దివి పద్మావతిలకు గాయాలయ్యాయి. ప్రీతి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డవారికి అదే ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని కేతేపల్లి పోలీసులు తెలిపారు.