రష్మిక చేతుల మీదుగా విడుదలైన ‘చిత్తం మహారాణి’

సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన చేతుల మీదుగా విడుదలైన ‘చిత్తం మహారాణి’ చిత్రంలోని కోలకళ్ళ చిన్నది పాటకు అనూహ్య స్పందన..

రష్మిక చేతుల మీదుగా విడుదలైన 'చిత్తం మహారాణి'

హైదరాబాద్ : లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా చిత్తం మహారాణి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కోలకళ్ళ చిన్నది లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు:
యజుర్వేద్, రచన, సునీల్, తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని..

టెక్నికల్ టీం:

దర్శకుడు:- కాశీ
నిర్మాతలు:- జేఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టీఆర్
మాటలు :- సురేష్ సిద్హాని
ఎడిటర్:- కార్తీక శ్రీనివాస్
సంగీతం:- గౌర హరి
డీవోపీ:- విశ్వనాథ్ రెడ్డి
యాక్షన్ కొరియోగ్రాఫర్:- డ్రాగన్ ప్రకాష్
కొరియోగ్రాఫర్ :- విజయ్ బిన్నీ
డీఐ :- అన్నపూర్ణ స్టూడియోస్
డీఐ :- టెక్నికల్ హెడ్:- సీ.వీ.రావు
కలరిస్టు:- విష్ణు వర్ధన్.కె
పీఆర్వోలు: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్