అనుమతి లేకుండా చేస్తే చర్యలే : సీపీ రంగనాథ్

అనుమతి లేకుండా చేస్తే చర్యలే : సీపీ రంగనాథ్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోఖోలు, నిరసనలు, ర్యాలీలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిచిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఇకపై రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు గాని ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు నిర్వహించాలనుకున్నాముందస్తుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు, వాహనదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా చట్టవిరుద్ధంగా ఆకస్మికంగా ధర్నాలు, నిరసలు, రాస్తారోఖోల్లో పాల్గోనే వ్యక్తులపై చట్టపరంగా కేసులను నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనుమతి లేకుండా చేస్తే చర్యలే : సీపీ రంగనాథ్ముఖ్యంగా వ్యక్తుల ఇండ్ల ముందుగాని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వైద్యశాలతో పాటు ప్రధాన రోడ్డు మార్గాలపై ఎవరైనా చట్టవిరుద్ధంగా ముందుస్తు అనుమతులు లేకుండా ఆకస్మికంగా ధర్నాలు, రాస్తారోఖోలు, నిరసలు పాల్పడటం సరైన మార్గంకాదన్నారు. ఏదైనా సమస్య వుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాని ప్రజలకు, వాహనదారులు, అధికారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రజలు వ్యవహరించవద్దని సూచించారు.

ముఖ్యంగా ఇటీవల కాలంలో కొద్ది మంది వ్యక్తులు వివిధ కారణాలతో మరణించిన వ్యక్తుల మృతదేహాలను ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో వుంచి, మీరే మరణానికి కారకులంటూ ఇంటి యజమానులు, అధికారులను డబ్బులను డిమాండ్ చేస్తూ ఒత్తిళ్లకు గురిచేస్తుండటం శోచనీయన్నారు. దీని వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లుగా తమ దృష్టికి రావడం జరిగిందని తెలిపారు. కావున ఏదైనా సమస్య వుంటే న్యాయపరంగా అధికారుల దృష్టికి తీసుకపోవాలని సీపీ ఏవి రంగనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు.