రాబోయే 40 రోజులు కీలకం

రాబోయే 40 రోజులు కీలకం

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఎఫ్ -7 వ్యాప్తి వల్ల కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో భారత్ లోనూ కలవరం మొదలైంది. గత అనుభవాల ఆధారంగా 2023, జనవరిలో కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రానున్న 40 రోజులు భారత్ కి చాలా కీలకమని హెచ్చరించాయి. గతంలో కరోనా కేసులు కొత్త వేవ్ తూర్పు ఆసియాలో మొదలైన 30- 35 రోజుల తర్వాత భారత్ కు చేరిందని ఓ అధికారి తెలిపారు.రాబోయే 40 రోజులు కీలకంపాత వేరియంట్లతో పోలిస్తే బీఎఫ్ -7 వేరియంటల్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుందని, దీని బారిన పడిన ఒక్కో వ్యక్తం వల్ల మరో 16 మందికి ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉందని ఆ అధికారి వివరించారు. ఐతే ఈ సారి కొవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రత పెద్దగా ఉంటుందని, ఒకవేళ మరో వేవ్ మొదలైనా మరణాలు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు.