కేటీఆర్ మామ కన్నుమూత.. సీఎం కేసీఆర్ నివాళి 

కేటీఆర్ మామ కన్నుమూత.. సీఎం కేసీఆర్ నివాళి కేటీఆర్ మామ కన్నుమూత.. సీఎం కేసీఆర్ నివాళి 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథ్ రావు (72) గురువారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కుటుంబసభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం హరినాథ్ రావు మృతదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు.

సీఎం కేసీఆర్ నివాళి..

కేటీఆర్ మామ కన్నుమూత.. సీఎం కేసీఆర్ నివాళి 

హరినాథ్ రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా నివాళులర్పించి, కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు.