కోల్ కతా పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ

కోల్ కతా పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : ఉత్కంఠభరిత పోరులో కోల్ కతాపై రాజస్థాన్ పైచేయి సాధించింది. ఆఖరి ఓవర్ వరకు జరిగిన మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్ కతా 210 ప రుగులకు ( 19. 4 ఓవర్లు ) ఆలౌటైంది. యుజ్వేంద్ర చాహల్ ( 5 /40) హ్యాట్రిక్ తో సహా ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.కోల్ కతా పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీచివరి ఓవర్ లో 11 రన్స్ కావాల్సిన ఉండగా, మెక్ కాయ్ (2 /41) మూడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లను తీసి రాజస్థాన్ కు విజయాన్నందించాడు. కోల్ కతా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ ( 85), ఆరోన్ ఫించ్ (58), ఉమేశ్ యాదవ్ ( 21), నితీశ్ రాణా (18) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 217/5 స్కోర్ చేసింది. జోస్ బట్లర్ (103) శతకంతో రాజస్థాన్ భారీ స్కోరు చేయగల్గింది.