ఒమిక్రాన్ తో పిల్లల్లో శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లు

ఒమిక్రాన్ తో పిల్లల్లో శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లు

వరంగల్ టైమ్స్, వాషింగ్టన్ : ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వల్ల చిన్నారుల్లో శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లు సోకుతున్నట్లు కొత్త అధ్యయనంలో వెల్లడించారు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ల వల్ల పిల్లలు గుండెపోటు లేదా ఇతర తీవ్ర సమస్యల్ని ఎదుర్కునే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ, స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ పరిశోధకులు సుమారు 18,849 మంది చిన్నారులపై అధ్యయనం చేశారు.ఒమిక్రాన్ తో పిల్లల్లో శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లుఆ పిల్లలంతా 19 యేళ్ల లోపువారే. జామా పిడియాట్రిక్స్ జర్నల్ లో దీనిపై రిపోర్ట్ ను పబ్లిష్ చేశారు. ఒమిక్రాన్ వల్ల యువ పిల్లల్లో యూఏఏ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు పిల్లల్లో యూఏఐ ( అప్పర్ ఎయిర్ వే ఇన్ ఫెక్షన్స్ ) కేసులు అధికంగా నమోదు అయినట్లు తేలిందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఆస్పత్రుల్లో చేరిన 21.1 శాతం మంది పిల్లల్లో తీవ్రమైన యూఏఐ కేసులు నమోదైనట్లు తేల్చారు.

ఆ పిల్లల శ్వాస కోసం ఊపిరితిత్తులకు ట్యూబ్ లను ఎక్కించినట్లు చెప్పారు. ఇంటుబేషన్ అనే పద్ధతిలో చికిత్స ఇచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. తీవ్రమైన యూఏఐ వ్యాధి సోకిన వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని, ఎందుకంటే శ్వాసనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోతాయని తెలిపారు. దాని వల్ల గుండెకు శ్వాస అందకపోవచ్చని చెప్పారు. ఆ సమయంలో ఇంటుబేషన్ చికిత్సలో భాగంగా రెసిమిక్ ఎపినీఫ్రన్, హీలియం-ఆక్సీజన్ మిక్సర్ లాంటి పలు థెరపీలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.