ఈ ఫుడ్ మీ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతాయి !

ఈ ఫుడ్ మీ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతాయి !

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : మానవులలో మెదడు అభివృద్ధి బాల్యంలోనే జరుగుతుంది. అందుకే చిన్నతనంలో వారికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడే సప్లిమెంట్లను ఇస్తారు. కానీ వీటితో చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే పిల్లల ఎదుగుదలతో పాటు జ్ఞాపకశక్తి చురుగ్గా ఉండేలా ఎలాంటి ఆహార పదార్థాలు వారికి అందించాలో తెలుసుకుందాం.ఈ ఫుడ్ మీ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతాయి !పౌష్టికాహారం :
పౌష్టికాహారం అంటే ప్రోటీన్, డిహెచ్ఏ, క్యాల్షియంతో పాటు కొన్ని ఇతర ఖనిజాలతో కూడిన సహజమైన ఆహారాన్ని పిల్లలకు అందించడం చాలా ముఖ్యం. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో ఎంతోగానో సహాయపడుతుంది.

గుడ్లు :
గుడ్లలో ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్, పోలేట్ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి చాలా అవసరం. గుడ్లలో మెల్కోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. అందుకే పిల్లలకు ప్రతీ రోజుకు గుడ్డు తినిపించాలని వైద్యులు చెబుతుంటారు.

నెయ్యి :
నెయ్యిలో చాలా మంది కొవ్వు ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ నిజానికి నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పిల్లల మెదడుకు పదును పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు మీ పిల్లలకోసం వండి వంటకాల్లో రోజుకో చెంచా నెయ్యి వేసి తినిపిస్తే ఆరోగ్యంతో పాటు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

పాలు :
పాలు శరీరం పెరుగుదలకు సహాయపడతాయి. ఎముకలను బలంగా ఉంచేలా తోడ్పడతాయి. పిల్లల మెదడు అభివృద్ధికి కూడా సహాయపడతాయి. పాలల్లో పాస్పరస్, విటమిన్ డి తో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల సమగ్ర అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

డ్రై ఫ్రూట్స్ :
డ్రై ఫ్రూట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వాల్నట్స్, బాదం పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ పిల్లలు జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇంతగానో సహాయపడతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ప్రయోజనాలు పొందడానికి మీరు వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. వీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే శరీరానికి పోషకాలు అందుతాయి

అరటిపండు :
అరటిపండులో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. అరటిపండు తినడం వల్ల పిల్లలకు శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. పిల్లలు అరటి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి పిల్లలకు ప్రతీ రోజు ఒక అరటి పండు తినిపించడం చాలా ముఖ్యం.