మార్చి 2 నుంచి విద్యార్థులకు రాగిజావ 

మార్చి 2 నుంచి విద్యార్థులకు రాగిజావ

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు రాగిజావ అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.