సాగర్ లో ముగ్గురు యువకులు గల్లంతు 

సాగర్ లో ముగ్గురు యువకులు గల్లంతు

వరంగల్ టైమ్స్, నల్గొండ జిల్లా : నాగార్జున సాగర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం వెళ్లి గల్లంతైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో నల్గొండకు చెందిన చంద్రకాంత్ (20), వాచస్పతి( 26), నాగరాజు ( 39) గుర్తించారు. ఉపనయనం కోసం పుష్కరఘాట్ కు యువకులు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఘాట్ లో స్నానాలు చేసేందుకు యువకులు దిగి గల్లంతైనట్లు సమాచారం.