ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి 

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

వరంగల్ టైమ్స్, కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లా కేంద్రంలో పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. మానేరు నదిపై కొత్తగా నిర్మించిన తీగల వంతెన వద్ద ఈత కోసం వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. ఘటనా స్థలంలో మరో బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న తిమ్మాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. వాగులో నుంచి ముగ్గురు బాలుర మృతదేహాలను వెలికి తీశారు.

మృతులను కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. హోలీ పండుగ సందర్భంగా సెలవు కావడంతో నలుగురు బాలురు కలిసి సరదాగా ఈతకొట్టేందుకు తీగల వంతెన వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే నీటిలో మునిగిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.