పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతైన యువకులు

పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతైన యువకులు

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ఉగాది పర్వదినాన ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. ఉగాది సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వెళ్లి ముగ్గురు యువకులు నీటమునిగి గల్లంతైన ఘటన ఏటూరునాగారం మండలం రొయ్యూరులో చోటుచేసుకుంది.
పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతైన యువకులుగ్రామదేవతను గంగ స్నానానికి తీసుకెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులతో పాటు ఓ బాలుడు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన యువకులను నితీష్ (17), సాయి వర్ధన్ (17), సందీప్ (12) లుగా స్థానికులు గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.