హైదరాబాద్ మెట్రో రైలు వేగం పెంపు..ఎంతంటే !

హైదరాబాద్ మెట్రో రైలు వేగం పెంపు..ఎంతంటే !

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు వేగం పెరగనుంది. ఈ మేరకు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతులు మంజూరు చేసింది. దీనివల్ల నగరంలో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల సమయం ఆదా కానుంది. నాగోలు – రాయదుర్గంల మధ్య 6 ని. లు, మియాపూర్‌ – ఎల్బీనగర్‌ల మధ్య 4 ని. లు, జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ల మధ్య 1.5 ని. ల ప్రయాణ సమయం తగ్గనుంది. మెట్రో రైలు గతంలో 80 కి.మీ వేగంతో ప్రయాణించేది. సీఎంఆర్ఎస్ ఆమోదంతో తాజాగా ఈ వేగం 90 కి.మీకి పెరగనుంది.