4న తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ 

4న తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజగా మరోసారి తెలంగాణ సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ ఈనెల 4న సమావేశం కాబోతున్నారు.4న తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మాణికం ఠాగూర్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం.