మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ 

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ శుభవార్త వినిపించింది. సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేసేందుకు వీలుగా ప్రయాణికులకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్లో సూపర్ సేవర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. సెలవుల్లో రూ. 59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చన సూచించారు. మెట్రో వర్గాలు ప్రకటించిన వంద రోజుల సెలవుల్లో ఈ సూపర్ సేవర్ కార్డు ఉపయోగపడుతుందని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్