13 మంది సైనికులను కాల్చేసిన రష్యన్ నేవీ

13 మంది సైనికులను కాల్చేసిన రష్యన్ నేవీవరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ పై రెండో రోజు రష్యా దాడి కొనసాగుతున్నది. పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు దూసుకెళ్తున్నాయి. అయితే మాస్కో సైన్యంతో ఉక్రెయిన్ దళాలు శక్తిమేర పోరాడుతూ సాహసాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని రక్షించడానికి సైనికులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శత్రువుకు లొంగిపోకుండా తుదిశ్వాస విడుస్తున్నారు. రష్యా సరిహద్దుల్లోని నల్ల సముద్రంలో ఉక్రెయిన్ కు చెందిన స్నేక్ ద్వీపం ఉన్నది. అక్కడ రక్షణగా తన బలగాలను మోహరించింది.

గురువారం ఉదయం ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఆ సమయంలో స్నేక్ ద్వీపంలో 13 మంది సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సముద్ర జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న రష్యన్ నేవీకీ చెందిన వార్ షిప్ అక్కడికి వచ్చింది. దీంతో ఉక్రెయిన్ సైనికులను గుర్తించిన వార్ షిప్ సిబ్బంది వారిని లొంగి పోవాలని సూచించారు. లేదంటే కాల్చేస్తామని హెచ్చరించారు. దానికి ఆ సైనికులు తిరస్కరించడంతో వార్ షిప్ నుంచి గుండ్ల వర్షం కురిసింది. దీంతో 13 మంది ఉక్రెయిన్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.