ఉక్రెయిన్ లో చిక్కుకున్నవారి కోసం హెల్స్ లైన్

ఉక్రెయిన్ లో చిక్కుకున్నవారి కోసం హెల్స్ లైన్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణా భవన్, హైదరాబాద్ సచివాలయాల్లో ప్రత్యేక హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కోసం ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ సెంటర్లకు రాత్రి నుండి 75 కాల్స్ వచ్చాయని సీఎస్ పేర్కొన్నారు. ఉక్రేయిన్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి యోగ క్షేమాలకై ఎప్పటికప్పుడు భారత విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయమై జనరల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి, ఢిల్లీలోని రెసిడెంట్ కమీషనర్ సంబంధిత అధికారులతో సీఎస్ నేడు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.