మహిళా సీఐ సుకన్య సస్పెండ్..

మహిళా సీఐ సుకన్య సస్పెండ్..వరంగల్ టైమ్స్, ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఎస్ఈబీ సీఐ సుకన్య సస్పెండ్ అయ్యారు. ఉలవపాడు మండలం ఆత్మకూరులో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కు ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు ఆమె పంపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో ఆమె లంచం తీసుకుందని అధికారులు నిర్దారించారు. సిబ్బందిని విచారించి సీఐ సుకన్యను సస్పెండ్ చేశారు.