పడవ బోల్తాపడి 16 మంది గల్లంతు

పడవ బోల్తాపడి 16 మంది గల్లంతువరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : జార్ఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. బార్బెండియా వంతెన సమీపంలో దామోదర నదిలో పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది వరకు ఉన్నారు. ధన్ బాద్ లోని నిర్సా నుంచి జమ్తారాకు వెళ్తున్న సమయంలో పడవ బోల్తాపడింది. ఇప్పటివరకు నలుగురిని రక్షించి, ఆస్పత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.