బాక్సింగ్‌డే టెస్టుకు వార్నర్, అబాట్ ఔట్
వరంగల్ టైమ్స్, సిడ్నీ : టీమీండియాతో బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆసీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆ స్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గజ్జల్లో గాయం నుంచి కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు దూరమవనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం పేర్కొంది. అలాగే వార్నర్‌తోపాటు పేసర్ సీన్ అబాట్ ఇద్దరినీ మెల్బోర్న్లోని ఆసీస్ క్రికెట్ టీమ్ బయోసెక్యూర్ బబుల్‌కు దూరంగా ఉంచామని సీఎ స్పష్టంచేసింది.
గాయం నుంచి కోలుకునేందుకు ఇద్దరు ఆటగాళ్లు కూడా సిడ్నీలో ఉన్న విషయం తెలిసిందే. టీమీండియా, ఆసీస్ మధ్య రెండో టెస్టు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో డిసెంబర్ 26 నుంచి జరుగనుంది. అయితే రెండో టెస్టు వరకు కూడా వార్నర్ గాయం నుంచి కోలుకునే అవకాశాలు లేకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నది. సిడ్నీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్వారంటైన్ ఇబ్బందులు తలెత్తకుండా వార్నర్, అబాట్ ఇద్దరూ కూడా శనివారమే మెల్బోర్న్కు వచ్చారు.