లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎస్సైపై సస్పెన్షన్ వేటు

లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎస్సైపై సస్పెన్షన్ వేటుమహబూబాబాద్ జిల్లా : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మరిపెడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా ట్రైనీ ఎస్సైని లైంగికంగా వేధించినట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై అందిన ఫిర్యాదు పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆకస్మిక తనిఖీలు చేయాలని చెప్పి తనని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని బాధితురాలు వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి కి ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి తనకు న్యాయం చేయాలని కమిషనర్ ను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన సీపీ విచారణకు ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ కొనసాగుతున్నదనీ, ఆరోపణలు నిజమైతే ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తప్పవని సీపీ తెలిపారు.