మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు

మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు

మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ,తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.జూన్ 24 నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో ను క్రోడికరించి, రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబంధు అందుతున్నదో వీరికీ అదే పధ్దతిలో రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు.ఇందుకు సంబంధించి నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని,ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కేసీఆర్ ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వాహించాలని సూచించారు.

ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్య లో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం నిర్ణయించారు.గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరితగతిన తయారు చేయాలని, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. జూన్ 14,వైద్య ఆరోగ్య దినోత్సవం’నాడు నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.2000పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.

అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విన్నపానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. 59 జీవో ద్వారా ప్రతీ పేదవాడికి న్యాయం చేస్తానని, కాలనీ వాసుల సమస్యలను తొలగించడానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.మహబూబాబాద్ నియోజకవర్గంలో నీరు వృధాగా పోకుండా చెక్ డ్యామ్ లను త్వరలో మంజూరు చేయాలని కోరగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

జర్నలిస్టులకు ఇచ్చిన మాట ప్రకారం మహబూబాబాద్ పట్టణంలో 99మందికి ఇళ్ల స్థలాల పంపిణీ అనుమతి కోరగా, స్పందించిన సీఎం కేసీఆర్ సీఎస్ కి ఆదేశాలు జారీ చేశారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో హార్టికల్చర్ డిగ్రీ కళాశాలకు ఏర్పాటు గురించి కోరగా త్వరలో అనుమతి ఇస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు.

త్వరలో ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతి, ల్యాండ్ సేకరించాలని ఆదేశాలిచ్చారు.ఇవే కాకుండా ఇంకా ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ కు వివరించగా వాటిపై కూడా స్పందించి అన్నింటికీ అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.సీఎం కేసీఆర్ మహబూబాబాద్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించడంతో మహబూబాబాద్ ప్రజల పక్షాన సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే శంకర్ నాయక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడారు మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని,ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా అమలు చేశానని,ఒకటి అర మిగిలి ఉన్నా వాటిని త్వరలోనే పూర్తి చేస్తానన్నారు.ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్నానని మానుకోట ప్రజల అండదండ,ఆశీర్వాదం తనపై ఎప్పుడూ ఇలాగే ఉండాలన్నారు.