వచ్చే 3 గంటల్లో వర్షాలు..తెలంగాణకు మరో అలర్ట్

హైదరాబాద్ : తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండ్రోజుల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిద్ధిపేట, జనగామ, యాదాత్రి, మెదక్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3 గంటల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.