జీఓ నం.317ను రద్దు చేయాల్సిందే : రావు పద్మ, బీజేపీ

జీఓ నం.317ను రద్దు చేయాల్సిందే : రావు పద్మ, బీజేపీహనుమకొండ జిల్లా : జీఓ నం. 317ను రద్దు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేశారు. 317 జీఓను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందో కూడా అర్థంకాని పరిస్థితి ఉందని ఆమె ఎద్దేవా చేశారు. జీఓ నం.317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా డీఈఓ ఆఫీస్ ఎదుట ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఈ దీక్షకు బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొని వారు డిమాండ్లకు మద్దతు పలికారు. 317 జీఓను రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని రావు పద్మ అన్నారు. ఉపాధ్యాయులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ దీక్షలో రావు పద్మతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డా.విజయ రామారావు పాల్గొన్నారు.