అది అబద్దమని హీరో నాగార్జున ట్వీట్
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : టాలీవుడ్ హీరో నాగార్జున తాజాగా ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో తాను సమంత, నాగచైతన్య గురించి మాట్లాడినట్టుగా వస్తున్న ప్రచారం అబద్దమని నాగార్జున స్పష్టం చేశారు. సమంత, నాగచైతన్య గురించి నేను మాట్లాడాను అంటూ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అది పూర్తిగా అవాస్తవం. రూమర్స్ ను న్యూస్ గా పోస్ట్ చేయొద్దని నేను మీడియా మిత్రులను కోరుతున్నాను అంటూ నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపారు.
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి అసలు కారనం సమంతేనని, తనే ముందు విడాకులు కావాలని కోరిందని, ఈ విషయంలో నాగ చైతన్య చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించాడని నాగార్జున అన్నట్లుగా సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దానిపై నాగార్జున తాజాగా ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు.