నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారంహైదరాబాద్ : ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఒంటేరు యాదవ రెడ్డి, ఎల్ రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హాసన్ జాఫ్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, కౌన్సిల్ రూల్స్ బుక్స్, ఐడి కార్డ్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.