యూజీసీ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి

యూజీసీ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తివరంగల్ టైమ్స్,నల్గొండ జిల్లా : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్‌గా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) వైస్ ఛాన్స్‌లర్, తెలంగాణలోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన 2016 నుంచి JNU వీసీగా పనిచేస్తుండగా గత నెల 26 నాటికి ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. అయితే తదుపరి వీసీని నియమించే వరకు కేంద్రం ఆయనను కొనసాగాలని సూచించింది. ఈ క్రమంలోనే UGC ఛైర్మన్‌గా నియమించింది.