తగ్గిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

తగ్గిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 4,75,128 మంది మృతి చెందారు. మరో 93,277 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.తగ్గిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యగత 559 రోజుల్లో యాక్టివ్ కేసులు ఇంత తక్కువకు చేరుకోవడం ఫస్ట్ టైం అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మహమ్మారి వల్ల మరో 398 మంది బాధితులు మరణించారని తెలిపింది. 9265 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.