శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు  

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు

వరంగల్ టైమ్స్, తిరుమల : కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు తమ ఇలవేల్పులను దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంట్లో భాగంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు  నిన్న 64,986 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 33,200 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ. 4.28 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.