కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

వరంగల్ టైమ్స్, మహారాష్ట్ర : దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. అనంతరం తిరిగి సాయంత్రం కేసీఆర్ దంపతులు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకున్న సీఎం కేసీఆర్