సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్

సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్

హనుమకొండ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ దంపతులు శనివారం ములుగు జిల్లాలోని రామప్ప పర్యటన ముగించుకుని హనుమకొండ ఎన్ ఐటీలోని అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఎన్ ఐటీ కలాం గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఎన్వీ రమణకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జ్యుడీషియరి, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్

సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్

సీజేఐకి ఘన స్వాగతం పలికిన మంత్రులు, చీఫ్ విప్జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఏ.రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి కం అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ వరంగల్ యూనిట్ జస్టిస్ పి.నవీన్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్యేలు డా.టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, ఒడితెల సతీష్, మేయర్ గుండు సుధారాణి, సీపీ తరుణ్ జోషి, డీసీపీ పుష్ప, డీఆర్ఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్ లాన్ లో లలిత సంగీత కచేరి ఏర్పాటు చేశారు.