కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా

కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదాఖమ్మం జిల్లా : ఖమ్మం నగరంలో 2022, జనవరి 2న జరగాల్సిన మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్నిరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించతలపెట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరో తేదీకి వాయిదా వేశామని చెప్పారు. తర్వాత తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు. కాగా, సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పర్యటన యథాతదంగా కొనసాగనుంది. ఆయా కార్యక్రమాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే పాల్గొంటారు.