ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 44 మందికి ఒమిక్రాన్..

ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 44 మందికి ఒమిక్రాన్..హైదరాబాద్ : దేశంలో కరోనా విస్తృతి వేగంగా పెరిగిపోతుంది. మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా స్పీడ్ గానే పెరుగుతున్నాయి. నేడు కేరళలో భారీగా ఒక్కరోజే 44 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ లు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 107కు చేరింది.

ఈ వివరాలను కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి పేర్కొన్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నామని వీణాజార్జి వెల్లడించారు. కరోనా కట్టడి కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 98 శాతం మందికి తొలిడోస్, 79 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైందని పేర్కొన్నారు.