తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయంహైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలను పొడిగిస్తున్నట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెలాఖరు వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. కరోనా కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది.