పెద్దపల్లి జిల్లా : సింగిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని-మంథని రహదారిపై వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఒక కానిస్టేబుల్ అతని కుటుంబసభ్యులకు తీవ్రగాయాలయ్యాయి. సదరు కానిస్టేబుల్ బెల్లంపల్లికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు అంబులెన్స్ తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వారందరినీ కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సదరు కానిస్టేబుల్, తన కుటుంబంతో కలిసి మేడారం జాతరకు వెళ్లి తిరిగొస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే సింగిరెడ్డిపల్లి వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
Home Crime
Latest Updates
