అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్హైదరాబాద్ : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టైంది. ఈ ముఠాకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్ లో 1.80 కోట్లు ఉంటుందని అంచనా. శంషాబాద్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ ముఠా దొరికిపోయింది. గంజాయి తరలిస్తున్న వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గురించి మరిన్ని వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించనున్నారు.