24 గంటల్లో వైరస్ తో 703 మంది మృతి

24 గంటల్లో వైరస్ తో 703 మంది మృతిన్యూఢిల్లీ : భారత్ లో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,47,254 మంది కరోనా బారినపడ్డారు. నిన్నటితో పోలిస్తే కొత్తగా 29,722 కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక 24 గంటల్లోనే వైరస్ బారినపడి 703 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,51,777 గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. యాక్టివ్ కేసులు 20,18,825 ఉన్నాయి. రోజు వారి పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా కొత్తగా 9,692 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 4.36 శాతం అధిక కేసులు నమోదయ్యాయి.