బీఆర్ఎస్ ఉన్నంత వరకు గెలుపు ఏకపక్షమే- పెద్ది

బీఆర్ఎస్ ఉన్నంత వరకు గెలుపు ఏకపక్షమే- పెద్ది

బీఆర్ఎస్ ఉన్నంత వరకు గెలుపు ఏకపక్షమే- పెద్ది

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : అసత్య ప్రచారాలతో అలజడులు సృష్టించే కాంగ్రెస్ కు చరమ గీతం పాడాల్సిందేనని నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలో పలు గ్రామాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చెన్నారావుపేట టౌన్ లో వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అభివృద్ధి చేశాను మళ్ళీ ఆదరించండని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి చెన్నారావుపేట ప్రజలు, వ్యాపార,వాణిజ్య, వర్తక సంఘాలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.

అనేక ఏండ్లుగా అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు మరోసారి పంజా విసరాలని చూస్తున్న సందర్భంగా ప్రజలంతా ఏకమై కోరలు పీకాలని పిలుపునిచ్చారు. తాను నర్సంపేట ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఒకప్పటిలా రాజకీయ ఘర్షణలు లేవు, అభివృద్దే ఎజెండా తప్పా తనకైతే స్వతహాగా వేరే జెండా లేదని అన్నారు. తన సొంత గ్రామం లెక్కనే నియోజకవర్గంలో ప్రతీ గ్రామాన్ని భావిస్తున్నానని అన్నారు. గులాబి జెండా ఉనికి ఉన్నంత వరకు నర్సంపేటలో ఏక పక్షమే తప్పా, అఖిల పక్షాలు ఉండబోవని అన్నారు.

కాంగ్రెస్ కంటే కరోనా నయమని ఎద్దేవా చేశారు. కొట్లాటలు, రెచ్చ గొట్టే రాజకీయ సంస్కృతి నుండి ప్రశాంతత వాతావరణం దిశగా మన ప్రయాణం కొనసాగుతుంది.అనతి కాలంలోనే అద్భుతంగా అభివృద్ది చెందిన నియోజకవర్గంగా నర్సంపేటకు గుర్తింపు వచ్చిందన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, ఇది ఒక చారిత్రాత్మక మార్క్ అని ఆయన అన్నారు. చరిత్రలో నిలిచిపోయే మెజారిటీ ఇచ్చి కృతజ్ఞత చాటాలని పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.