బడే నాగజ్యోతికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి దనసరి అనసూయ ములుగు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి విమర్శించారు. ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బడే నాగజ్యోతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బడే నాగజ్యోతిపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
అంతేకాకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలకు, అడగకముందే ములుగు నియోజకవర్గానికి కావాల్సినవి ఇచ్చిన కేసీఆర్ పరిపాలనా తీరుపై ఆకర్షితులైన అనేక మంది యువత బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఇంటింటి ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి సమక్షంలో 150 మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడారు. 20యేళ్ల రాజకీయ అనుభవం ఉండి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దనసరి అనసూయ అలియాస్ సీతక్క ములుగు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. ములుగు నియోజకవర్గానికి చేయాల్సిన పని గురించి కనీసం ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. గిరిజనులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమైతే, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు. ఇచ్చిన మాటకోసం చచ్చేదాక పనిచేసే తత్వం ఉన్న తనదని అన్నారు.
ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి, మన గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి పనులు చేస్తానని అన్నారు.కాబట్టి ప్రతి యొక్కరు నవంబర్ 30న కారు గుర్తుకే ఓటు వేసి నిండు మనసుతో తనను ఆశీర్వదించి, ముచ్చటగా మూడవ సారి కేసీఆర్ ని సీఎం చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ సాంబారి సమ్మరావు, జడ్పీటీసీ గై రుద్రమదేవి అశోక్, మండల పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, గ్రామ అధ్యక్షులు, సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.