ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్డీకపూల్ బీఎస్పీ కార్యాలయంలో ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఇంటికి తరలించారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విటర్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. “మీరు ఎన్ని అరెస్టులు చేసినా నా పోరాటం ఆగదు. ఖబడ్దార్ కేసీఆర్. పేపర్ లింకులకు మీ కుటుంబానికి సంబంధం ఉంది. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఉన్నది మీ ఏజెంట్లే. ఇది సీబీఐ దర్యాప్తు ద్వారానే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. తెలంగాణ సమాజమంతా గమనించాలి” అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.