2022, జనవరి 17 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

2022, జనవరి 17 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీహైదరాబాద్ : సికింద్రాబాద్ ఈఎంఈ సెంటర్ లో హెడ్ క్వార్టర్ కోటా కింద 2022 జనవరి 17 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు మిలిటరీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సోల్జర్ టెక్నిషియన్, సోల్జర్ ట్రేడ్స్ మెన్ (చీఫ్, స్టీవార్డ్స్ ), సోల్జర్ టెక్నికల్ ( ఏవియేషన్), స్టోర్స్ క్యాటగిరీలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నారు.

అర్హులైన అభ్యర్థులు జనవరి 17 ఉదయం 6 గంటలకు కోటేశ్వర్ ద్వార్, 4 ట్రైనింగ్ బెటాలియన్, వన్ ఐఎంఈ సెంటర్ సికింద్రాబాద్ లో సంప్రదించాలి. మరిన్ని వివరాలకు సికింద్రాబాద్, బొల్లారం, వన్ ఈఎంఈ హెడ్ క్వార్టర్ సెంటర్ లో లేదా [email protected] కు ఈ మెయిల్ చేసి గానీ లేదా [email protected] వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.