పీయూష్ గోయల్ తో ముగిసిన టీ మంత్రులు, ఎంపీల భేటీ

పీయూష్ గోయల్ తో ముగిసిన టీ మంత్రులు, ఎంపీల భేటీన్యూఢిల్లీ : కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల భేటీ ముగిసింది. మంగళవారం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణపై రాతపూర్వక హామీకి మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగానే ఇవ్వాలని మంత్రులు పట్టుబట్టారు.

ఈ ప్రతిపాదనపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు. రైతుల విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని ఎంపీలు, మంత్రులు తేల్చిచెప్పారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.