రాహుల్ గాంధీకి ఢిల్లీ వర్సిటీ నోటీసులు!

రాహుల్ గాంధీకి ఢిల్లీ వర్సిటీ నోటీసులు!

రాహుల్ గాంధీకి ఢిల్లీ వర్సిటీ నోటీసులు!వరంగల్ టైమ్స్, ఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బుధవారం ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో యూనివర్సిటీలో ప్రవేశించడంపై నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ గతవారం ఢిల్లీ యూనివర్సిటిలోని పీజీ మెన్స్ హాస్టల్ కు చేరుకున్నారు. ఇక్కడ విద్యార్థులతో దాదాపు గంట సమయం గడిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మెస్ లో భోజనం చేశారు. హాస్టల్ రూల్ 15.13 ప్రకారం హాస్టల్ లో చదువుకునే వారు తప్ప మరెవరూ ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకూడదని నోటీసుల్లో పేర్కొంది. అయినప్పటికీ మే 5న రాహుల్ గాంధీతో పాటు పలువురు మూడు వాహనాల్లోహాస్టల్ లోకి చేరుకుని, దాదాపు గంట సేపు మెస్ లో సమయం గడిపారు. ఆయనతో ఉన్న వారంతా హాస్టల్ కు చెందిన వారు కాదని, ముందస్తు అనుమతి లేకుండా పర్యటించారని కనీసం హాస్ల్ నిర్వహకులకు, స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదు.

ఏ విజిటర్ అయినా మొదట హాస్టల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాహుల్ పర్యటన అనంతరం మే 6న డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ ప్రోక్టర్ సమక్షంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. హాస్టల్ లోని విద్యార్థులు, సిబ్బంది, అధికారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, క్రమశిక్షణతో కూడిన అంశమని డీయూ అధికారి ఒకరు పేర్కొన్నారు. యూనివర్సిటీకి రావాలనుకున్న సమయంలో సరైన ప్రోటోకాల్ అవసరమని, భవిష్యత్తులో క్యాంపస్ లోకి అనధికారికంగా అడుగుపెట్టకుండా ఉండేలా ఈ నోటీసులు జారీ చేసినట్లు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది.