జుట్టు విరబోసుకొని ఆలయానికి వెళ్లవచ్చా ?

జుట్టు విరబోసుకొని ఆలయానికి వెళ్లవచ్చా ?

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : హిందూమతగ్రంథాలలో ఎన్నో విషయాలు వివరంగా ఉంటాయి. అవి మన జీవితంతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు ఏ రోజు తలస్నానం చేయాలి. రుతుక్రమంలో ఎలాంటి వస్తువులు ముట్టుకోకూడదు. ఏ రోజున కుంకుమ పెట్టుకోవాలి. బట్టలు ధరించడానికి ఎలాంటి నియమాలు పాటించాలి. ఇలాంటి విషయాలు ఎన్నో గ్రంథాలలో పేర్కొన్నారు.జుట్టు విరబోసుకొని ఆలయానికి వెళ్లవచ్చా ?ముఖ్యంగా స్త్రీలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు వెంట్రుకలు వీరబోసుకుని వెళ్లకూడదు. ఈ విషయాన్ని గ్రంథాల్లో వివరించారు. చాలా మంది ఇళ్లలో పెద్దలు కూడా ఈ విషయాన్ని చెబుతుంటారు. వెంట్రుకల వీరబోసుకుని తిరగకూడదు…గుడిలోకి వెళ్లకూడదని.

అయితే ప్రధానంగా స్త్రీలు తలవెంట్రుకలు విరబోసుకుని గుడిలోకి ఎందుకు ప్రవేశించకూడదన్న విషయానికి వస్తే..ప్రజలు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. చెడు ఆలోచనలు లేదా ప్రతికూల భావాలు లేకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడిని ప్రార్థించడము అంటే దేవుడికి దగ్గరవ్వడం అని అర్థం. మనం గుడికి వెళ్ళినప్పుడు, శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. మన బట్టలు శుభ్రంగా ఉండాలి. మన శరీరం కూడా స్వచ్ఛంగా ఉండాలి.

కానీ వీరబోసుకున్న వెంట్రుకలతో ఆలయంలోకి ప్రవేశించకపోవడానికి ఓ కారణం ఉంది. స్త్రీల జుట్టు పురుషుల కంటే పొడవుగా ఉంటుంది. వీరబోసుకుని ఉండటం వల్ల, స్త్రీల మనస్సు దేవుని పట్ల భక్తికి బదులుగా జుట్టును సరిచేయడంపై దృష్టి పెడుతుంది. జడ అల్లుకుని వెళ్లిన మహిళలు పూజ సరిగ్గా చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా జడ వేసుకుని ఆలయానికి వెళ్లాలి.

పురాణాలప్రకారం రామయణం, మహాభారతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. రామాయణంలో కైకెయి, మహాభారతంలో ద్రౌపతి గురించి అందరికీ తెలిసిందే. అందుకే జుట్టు వీరబోసుకోవడం ప్రతికూలప్రభావం చూపుతుందని పురాణాలు చెబుతున్నాయి.

మహాభారతంలో, ద్రౌపదిని దుర్శాసనుడు దాడి చేసి అవమానించాడు. ఆమె జుట్టును పట్టి లాగుతాడు.అందుకే జుట్టు వీరబోసుకుని దేవాలయంలోకి ప్రవేశించడం మహిళల కోపానికి చిహ్నంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం, స్త్రీలు జుట్టు విరబోసుకుని ఏదైనా పూజలు, శుభకార్యాలు చేస్తే, అది ఆమోదయోగ్యం కాదు. జుట్టు విరబోసుకునే స్త్రీలు చేసే పూజను దేవతలు కూడా అంగీకరించరు.