బీ అలర్ట్..TSPSC కీలక ప్రకటన..!!

బీ అలర్ట్..TSPSC కీలక ప్రకటన..!!

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1540 పోస్టుల భర్తీకి సంబంధించి ఏఈఈ నోటిఫికేషన్ ను ఈ మధ్యే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన వెబ్ నోటీస్ రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అప్లికేషన్స్ సెప్టెంబర్ 22 నుంచి షురూ అయ్యాయి. అక్టోబర్ 15, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరించారు. అయితే మరో 5రోజుల గడువును పెంచారు.బీ అలర్ట్..TSPSC కీలక ప్రకటన..!!అయితే తాజాగా తమ దరఖాస్తుల్లో తప్పులు దొర్లాయంటూ కొంతమంది అభ్యర్థుల నుంచి రిక్వెస్టులు రావడంతో టీఎస్పీఎస్సీ ఎడిట్ అవకాశాన్ని కల్పించింది. దీనికోసం నవంబర్ 22 నుంచి నవంబర్ 24 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే సదుపాయం కల్పిస్తూ..వెబ్ నోట్ రిలీజ్ చేసింది.